బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బీజేపీ కార్యకర్తలు ఏడాది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పట్టణంలోని పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. సిఎస్ ఐ గ్రౌండ్ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ కొత్త బస్ స్టాండు, నిజాం సాగర్ చౌరస్తా, రైల్వే కమాన్, స్టేషన్ రోడ్, పొట్టి శ్రీరాములు విగ్రహం, జేపీఎన్ విగ్రహం, పాంచ్ చౌరస్తా, పెద్దబజార్ ల మీదుగా దేవునిపల్లి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 6 గ్యారెంటీలని వై చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 66 అబద్ధపు మాటలతో పబ్బం గడుపుతుంది తప్ప ప్రజాపాలన చేయటం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి కొత్తగా ఒక్క పించన్, ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వానికి సంబరాలు ఎందుకని ప్రశ్నించారు. ఒక్క లబ్దిదారుడికి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఏడాది పాలన పూర్తిగా విఫలం అయ్యిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం తప్ప ఏడాది కాలంగా రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కొత్తగా ఒక్క పించన్, ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వానికి సంబరాలెందుకు
by Sravan Kumar
Updated On: December 6, 2024 11:57 am
---Advertisement---