ప్రతీ సారి వేలం పాట లేకుండా కాంట్రాక్ట్ ఒక్కరికే దక్కడం వెనక మతలబు ఏంటి?
అసలు వేలం పాట పెట్టకుండా ఒక్కరికే కాంట్రాక్ట్ ఎలా అప్పగిస్తున్నారు?
తలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పశువుల సంతల్లో కొండమల్లేపల్లి సంత ఒకటి….
నిజానికి కొండమల్లేపల్లి గ్రామ పంచాయతీ నిధులకు కొండంత అండ ఈ పశువుల సంతనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…
ఈ సంతలో ఒక ఆవు లేదా ఒక బర్రెకు 1000 రూపాయలు
ఒక మేక లేదా ఒక గొర్రెకు 150 రూపాయల వరకు రుసుము వసూలు చేస్తుంటారు…
ప్రతి వారం 4 లక్షలకు పైగా లేదా అంతకంటే ఎక్కువగానే,
మరియు పెళ్ళిళ్ళు,పండుగలు సీజన్లలో ఇంకా అధికంగా రెండింతలు కలెక్షన్స్ ఉంటాయనేది వాస్తవం…
అలాంటి సంత కాంట్రాక్ట్ సంవత్సరాల కొద్దీ ఒక్కరే చేజిక్కించుకుని కొంచెం తేడాతోనే సుమారు(కోటి పదిలక్షలు)
డబ్బులు ప్రతి సంవత్సరం పంచాయతీకి చెల్లిస్తూ కాంట్రాక్ట్ ను దక్కించుకోవడం,
మరియు ప్రతి సారీ ఆ పాత కాంట్రాక్టరే ఈ సంత కాంట్రాక్ట్ ను చేజిక్కించుకోవడం వెనుక ఏం మతలబు ఉందో అనే విషయం స్థానికులకు మాత్రం అంతుపట్టడం లేదు….
కొండమల్లెపల్లి సంతలో పశువులు మరియు మేకలు,గొర్రెల అమ్మకాలు మరియు కొనుగోళ్ళ విలువ కోట్ల రూపాయల వరకు ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే…
అయితే ఈ సంతలో క్రయ,విక్రయాల నేపధ్యంలో పశువులు,మేకలు,గొర్రెలను కొనుగోలు చేసిన వ్యక్తి ఆ కొన్న వాటికి సంబంధించి గ్రామపంచాయతీకి కాస్త రుసుము చెల్లించాల్సి ఉంటుంది…
అలాంటి చెల్లింపుల కోసమే ప్రతీ సంవత్సరం వేలం పాట నిర్వహించి అత్యధికంగా డబ్బులు ఎవరైతే చెల్లించేలా వేలం పాట పాడతారో వారికే కాంట్రాక్ట్ ను ఇవ్వడం జరుగుతుంది….
అలాంటిది కొన్ని సంవత్సరాలుగా ఒక్క వ్యక్తే ఈ సంత కాంట్రాక్ట్ ను సొంతం చేసుకోవడం మరియు అసలు వేలం పాట నిర్వహించకుండా సదరు కాంట్రాక్టరే మళ్ళీ మళ్ళీ సంత కాంట్రాక్టు దక్కించుకోవడం ఏంటని స్థానికుల మదిలో మెదిలే ప్రశ్న?
ప్రతీ సంవత్సరం వేలం పాట నిర్వహించడం ద్వారా కొత్త వారు ఇంకా అధికంగా గ్రామ పంచాయతీకి డబ్బులను చెల్లించి కాంట్రాక్ట్ ను దక్కించుకునే అవకాశం ఉంది…
ఇలా వేలం నిర్వహించకపోవడం వలన పంచాయతీ నిధులకు గండికొట్టినట్టేనని స్థానికులు అంటున్నారు….
గ్రామ పంచాయతీకి అధిక నిధులు సమకూరితే ఊరి కోసం ఆ నిధులను ఉపయోగించుకోవచ్చని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు….
ఈ విషయాన్ని అధికారులకు తెలిసేలా చేసి,ఇప్పటికైనా ప్రతి సంవత్సరం వేలం పాట నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని అందుకే తమ అభిప్రాయాన్ని సమరశంఖమ్ పత్రిక ద్వారా జిల్లా అధికారులకు తెలియపరుస్తున్నామంటూ స్థానికులు తెలియజేయడం జరిగింది….