వైసీపీ నేతలు ప్రతిపక్ష హోదా కోసం పోరాడడం దారుణం: పార్థసారథి
అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యవహారశైలి దిగుజారుడుతనానికి నిదర్శనం అని మంత్రి పార్థసారథి అన్నారు. మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు తమ స్వార్థం కోసం పోరాడుతున్నారు.
ప్రజాసమస్యలపై కాకుండా ప్రతిపక్ష హోదా కోసం పోరాడడం దారుణమన్నారు. ఒక్క రోజు హాజరు కోసమే జగన్ అసెంబ్లీకి వచ్చారు. జగన్ సహా వైకాపా నేతలకు ప్రజా సమస్యలపై బాధ్యత లేదని మంత్రి పార్థసారథి వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు.