నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటికొల్ గ్రామంలో యువకులు బీభత్సం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది…
సినిమా ఫైటింగ్ ను తలపించేలా నడిరోడ్డుపై వీధిలో ఒకరినొకరు కొట్టుకున్నారు…
దాదాపు గంట సేపు అక్కడ గొడవ జరిగినట్లు తెలుస్తుంది…
దసరా పండగ రోజు జరిగిన బైక్ గొడవ ఈ దాడికి కారణమని తెలుస్తోంది..
దాడులకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి …
సీసీ ఫుటేజ్ వీడియోస్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు…
తాటికొల్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఇరువర్గాలకు చెందిన యువకుల మధ్య జరిగిన ఘర్షణలో మధు అనే యువకుని తలపై తీవ్ర గాయమై కుప్పకూలిపోయ్యాడు.
గ్రామస్తులు మధుని ఆటోలో దేవరకొండ ప్రభుత్వ హాస్పటల్ కి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ హాస్పటల్ కి తరలించారు.
తమ కుమారుడిపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు..
ఇటీవలి కాలంలో యువకులు మత్తు పదార్ధాలకు బానిసయ్యి గొడవలకు దిగుతున్నారని గ్రామస్తులు చెప్తున్నారు..