ఆదివారం నర్సంపేటలో బిజెపి చేన్నరావుపేట మండల అధ్యక్షులు దుంక దువ్వ రంజిత్ ఆధ్వర్యంలో చెరువుకొమ్ము తండ, ఎల్లాయిగూడెం నుండి యువకులు పాల్తీయ శశిందర్, భూక్యా రాజు, జరుపుల రవి మరియు బోడ శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బిజెపి కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ యువత కూడా రాజకీయాల్లో రాణించాలని తెలియజేశారు, రాజకీయాల్లో యువతకు భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తుందని తెలియజేశారు, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున యువతకే పెద్ద ప్రాధాన్యత వేసి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుడిపూడి రాధాకృష్ణ, నర్సంపేట రూరల్ మండల అధ్యక్షులు గంగిడి మహేందర్ రెడ్డి, నెక్కొండ మండల అధ్యక్షులు నాయిని అశోక్, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్ర రాజు, యువమోర్చా నాయకులు అబ్బరబోయిన రాజు, భూక్య సుధాకర్, పడిదం హరికృష్ణ, రాజ్ గోపాల్ యువమోర్చా నాయకులు పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.